Tirumala27june26 | తిరుమలలో తగ్గని రద్దీ
Tirumala27june26 | తిరుమలలో తగ్గని రద్దీ
శ్రీవారి దర్శనానికి తప్పని నిరీక్షణ
Tirumala27june26 | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ అత్యంత భారీగా కొనసాగుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ప్రస్తుతం ఎస్ఎస్డీ (SSD), దివ్య దర్శనం (DD) టోకెన్ కౌంటర్ల వద్ద భారీ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. అయితే టోకెన్ల జారీ ఇప్పటివరకు ప్రారంభం కాలేదని టీటీడీ స్పష్టం చేసింది. టోకెన్ల పంపిణీ ప్రారంభమైన వెంటనే అధికారిక సమాచారాన్ని విడుదల చేస్తామని తెలిపింది.
ఇక శ్రీవారి దర్శనానికి వేచి ఉండే సమయం కూడా గణనీయంగా పెరిగింది. నిన్న ఉదయం 9 గంటలకు ఉచిత సర్వదర్శనం క్యూలోకి ప్రవేశించిన భక్తులు కూడా ఇప్పటికీ శ్రీవారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారని టీటీడీ పేర్కొంది. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ అసాధారణ స్థాయిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో భక్తులు తమ తిరుమల యాత్రను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని, తాజా సమాచారాన్ని టీటీడీ అధికారిక ప్రకటనల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
