భగత్ సింగ్ ఆశయసాధనకు సమిష్టిగాకృషిచేద్దాం..

భగత్ సింగ్ ఆశయసాధనకు సమిష్టిగాకృషిచేద్దాం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన షాహిద్ భగత్ సింగ్ ఆశయ సాధనకు సమిష్టిగా కృషి చేద్దామని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి సలీం, బిజ్వార్ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, పి వై ఎల్ జిల్లా కార్యదర్శిసిద్దుపిలుపునిచ్చారు. సోమవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ లో భగత్ సింగ్ 95 వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ కార్యదర్శి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర సమర చరిత్రలో వలసవాద విముక్తికై పోరాడిన మహానీయుడనికొనియాడారు.

భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ వంటి విప్లవ వీరులు బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారనిగుర్తుచేశారు. సామ్రాజ్యవాద వ్యతిరేకతనే నిజమైన దేశభక్తి అని పోరాడి దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని బ్రిటిష్ వెళ్లిపోవాలని పార్లమెంటు లో బాంబు వేసి యువతరం ఆలోచన చేసే విధంగా కృషి చేశారన్నారు. సామ్రాజవాదములోభాగమైన యుద్ధం తక్షణమే ఆపాలని ,అమెరిక తమ లాభం కోసమేఇరాన్ పైదాడి చేయిస్తుందని యుద్ధం వల్ల సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భగత్ సింగ్ వారసులుగా సామ్రాజ్యవాదం వ్యతిరేకించడమే మన కర్తవ్యంఅన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు ఎల్లప్ప, గోపి, గోపి, రవి, పరశురాం, పోర్ల నరసింహ, గోవింద్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply