రోడ్డు ప్రమాదంలో పోలీసులకు తీవ్ర గాయాలు…

రోడ్డు ప్రమాదంలో పోలీసులకు తీవ్ర గాయాలు…

10వ తరగతి బందోబస్తు వెళ్తున్న సమయంలో..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఈరోజు లెక్కల పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షల సమయానికి వెళ్లాలన్న ఆత్రుతతో మోటార్ సైకిల్ పై వెళ్తున్న పోలీసులకు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విధుల నిమిత్తం బైక్ పై వెళ్తున్న సంజామలకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ను కారు ఢీ కొట్టింది.

ఉయ్యాలవాడలో పదో తరగతి పరీక్షల బందోబస్తు చూసుకొని నొస్సుం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కానిస్టేబుల్ మహేశ్వర్ రెడ్డి కి రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ మహేశ్వర్ రెడ్డికి కాలు విరిగింది. చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Leave a Reply