అసెంబ్లీ ముట్టడికి వెళుతుంటే..

అసెంబ్లీ ముట్టడికి వెళుతుంటే..

చిట్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నెరవేర్చని క్రమంలో సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చారు. హైదరాబాదులోని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి చిట్యాల మున్సిపాలిటీ నాయకులు వెళ్లే క్రమంలో చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ నేతృత్వంలో సోమవారం బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.

ఈ సందర్భంగా బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో రైతులను, మహిళలను, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్సర్ల అనేక హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 13 డిక్లేర్ రేషన్లు, 420 వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా తెలంగాణ సమాజంలోని ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ నిలువునా వంచిందని ఘాటుగా విమర్శించారు.

బీజేపీ పార్టీ రానున్న రోజుల్లో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ముందుకు వెళుతుందని అన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారు బీజేపీ ప్రధాన కార్యదర్శి చుంచు శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెల్ల శ్రీను, పాల రవివర్మ, బెల్లి నరేష్, మురళీకృష్ణ, నూకేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply