కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం

భీమారం, ఆంధ్రప్రభ ; కాంగ్రెస్ మండల పార్టీకి బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హాసన్ పర్తి మండలానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
గతంలో బిఆర్ఎస్ పార్టీ నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా ఎన్నికై ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి సొంత గూటికే చేరుతారని గుసగుసలు మండలంలో వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ ఆయనతో మాట్లాడగా కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్లనే పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
