తాటి రామచంద్రం జ్ఞాపకార్ధంగా చలివేంద్రం ప్రారంభం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ తాటి రామచంద్రం ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు.
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాజీవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాటి రామచంద్రం సేవా సమితి నేతృత్వంలో తాటి రామచంద్రం జ్ఞాపకార్ధంగా ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆదివారం మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య తో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ చేతుల మీదగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాటి రామచంద్రం కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. వారి జ్ఞాపకార్ధంగా సేవా సమితి చైర్మన్ తాటి వెంకటేశం ప్రతీ సంవత్సరం వేసవికాలంలో చలివేంద్రమును ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీరుస్తున్నందుకు గాను వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఫిషరీస్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ పాశం సంజయ్ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు పిల్లలమర్రి మధుసూదన్, పాక చిరంజీవి, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అధ్యక్షుడు బొబ్బిళ్ళ మురళి, సేవా సమితి చైర్మన్ తాటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి చెరుకు లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నరసింహ, నాయకులు గోశిక రవి, గుర్రం వెంకటేశం, గోశిక ప్రభాకర్, బొబ్బిళ్ళ రాజేందర్, రఫీ, బొంగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
