CPI | నారాయణ సంచలన వ్యాఖ్యలు

CPI | నారాయణ సంచలన వ్యాఖ్యలు

CPI | ఆంధ్రప్రభ,వెబ్ డెస్క్ : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయిల్ సంపదను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యుద్ధం కారణంగా భారత ప్రజలు బాధితులుగా మిగిలారని, దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టినవారు రోడ్డున పడ్డారని తెలిపారు. తిరుమల కల్తీ లడ్డూ అంశంపై కూడా ఆయన స్పందించారు. ఈ వ్యవహారంతో తిరుమలకు పూర్తిగా కళంకం ఏర్పడిందన్నారు. అలాగే ఇటీవల గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆయన మధ్యాహ్న భోజన పథకం గురించి అలా మాట్లాడటం సరికాదన్నారు. వైఎస్ కుటుంబంలో వివాదం విచారకరమని, కుటుంబ వ్యవహారాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు.