యూటీఎఫ్ పిలుపుతో ఒకరోజు నిరాహార దీక్షకు సిద్ధం…

యూటీఎఫ్ పిలుపుతో ఒకరోజు నిరాహార దీక్షకు సిద్ధం…

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం United Teachers Federation (యూటీఎఫ్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మార్చి 24, 2026 మంగళవారం రోజున జిల్లా వ్యాప్తంగా ఒకరోజు నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఈ దీక్షలు చేపట్టనున్నట్లు యూటీఎఫ్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు డి. శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులు మల్లికార్జున, రవివర్ధన్ రెడ్డి వెల్లడించారు.

ఈ క్రమంలో కదిరి పట్టణంలోని MRO కార్యాలయం ఎదుట నిర్వహించే నిరాహార దీక్షలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రోడ్లు-భవనాల అతిథి గృహంలో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు. ప్రధాన డిమాండ్లు పిఆర్సి కమిషన్ చైర్మన్‌ను వెంటనే నియమించాలి,29% ఐఆర్ ప్రకటించి, పెండింగ్ డి.ఏలు విడుదల చేయాలి, ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపుకు రోడ్ మ్యాప్ ప్రకటించాలి, సీపీఎస్ రద్దు చేసి, 2004కు ముందు నియామకాల వారికి పాత పెన్షన్ అమలు చేయాలి, హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలి, కోవిడ్ సమయంలో మరణించిన 953 పంచాయతీరాజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలి.

ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ తాహెర్ వలి, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సునీల్ కుమార్, కదిరి డివిజన్ నాయకులు మహబూబ్ బాషా, రమణ నాయక్, ఖాజాపీర్, నజీర్, జయశంకర్, నాగబసిరెడ్డి, రామకృష్ణారెడ్డి, రామలింగారెడ్డి, సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద, ఉద్యోగులు-ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నిరాహార దీక్షకు విస్తృత స్థాయిలో స్పందన లభించే అవకాశముందని యూటీఎఫ్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply