ఆంధ్రప్రభ ఎఫెక్ట్…కదిలిన అధికారులు
ఆంధ్రప్రభ ఎఫెక్ట్…కదిలిన అధికారులు
- కథనం వెలుగులోకి రావడంతో చర్యలు
- ప్రజల ఆవేదనకు స్పందించిన మున్సిపల్ యంత్రాంగం
- 16వార్డులో సైడ్ డ్రైనేజీలను శుభ్రం చేసిన సిబ్బంది
- స్వయంగా రంగంలోకి దిగిన శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ లింగయ్య
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో 16వ వార్డులోని శ్రీరామ్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజల ఆవేదనకు ఎట్టకేలకు స్పంద న లభించింది. వార్డులో చెత్త సేకరణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. గల్లీల్లో చెత్త పేరుకుపోయి కాలనీ చెత్త కుప్పగా మారింది. దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి మరింత దారుణంగా మారడంతో ప్రజలే స్వయంగా మోరులు శుభ్రం చేసుకో వాల్సి వచ్చిన దుస్థితి నెలకొంది. కాలనీ వాసులు ఎదు ర్కొంటున్న సమ స్యలను శనివారం ఆంధ్రప్రభలో ప్రచురించిన కథనం వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు కదిలారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రభలో ప్రచు రితమైన కథనానికి స్పందించిన శానిటేషన్ ఇన్‌స్పె క్టర్ లింగయ్య స్వయంగా వార్డును సందర్శించి సిబ్బందితో కలిసి పరిశీ లించారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు, చెత్తను తొలగిస్తూ సైడ్ డ్రైనేజీలను శుభ్రపరిచే పనులు చేపట్టించారు. సమస్య తీవ్రతను గుర్తించిన అధికారులు తక్షణ చర్యలు చేపట్టి పరిస్థితిని మెరుగుపర చేందుకు కృషి చేసారు. అనంతరం తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా మున్సిపల్ అధికా రులు క్రమం తప్పకుండా శానిటేషన్ చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
