ఉప్లూర్ లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం లోని ఉప్లూర్ గ్రామంలో ముస్లీం సోదరులు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శనివారం ఈద్గా వద్ద ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేసిన అనంతరం వారిని కలిసి ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ మత సామరస్యనికి ప్రతీక రంజాన్ పండుగ అని అన్నారు.
సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం,ఐక్యత మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తక్కురి ముత్యం, నాయకులు మారుపక నరేష్, సంగా పెద్దలు రఫిక్, ఫారూఖ్, సాదుల్లా, అజారుద్దీన్, ఇబ్రహీం, ఇమెమోద్దీన్, హఫీజ్, సల్మాన్, నజీర్, ఉబేద్ తదితరులు పాల్గొన్నారు.
