మైనార్టీల సంక్షేమానికి కేంద్రం కృషి..

మైనార్టీల సంక్షేమానికి కేంద్రం కృషి..

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : మైనార్టీ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబ డి ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రధాని మోదీ అన్ని మతాల వారికి కేంద్ర పథకాలు అందే విధంగా చూస్తు న్నార న్నారు. రంజాన్ పండు గను పురస్కరించుకొని అర్బన్ ఎమ్మెల్యే ధన్పా ల్ సూర్యనారాయణ గుప్తా ముస్లిం సోదరు లకు శుభాకాంక్షలు తెలిపారు.

శనివారం నగరంలోని ఖిల్లా రోడ్ లో గల బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ఎండి రషీద్ ని కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ సుఖ సంతోషాలు కలగాలని కోరారు. అనంతరం పలువురికి ఈద్ ముబా రక్ తెలిపారు.ఈ కార్య క్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పోరేటర్లు మఠం పవన్, చింతకాయల రాజేందర్, బంటు ప్రవీ ణ్, బళ్ళాల్ శశాంక్, ధాంపల్లి శివ, రాంపల్లి మురళి, బీజేపీ మైనార్టీ నాయకులు మునీరు ద్దీన్, అసద్, మారవార్ కృష్ణ, నాగరాజు పాల్గొన్నారు.

Leave a Reply