Hospital | మేము సమకూరిస్తే.. మీరు శంకుస్థాపనలు చేస్తారా..

Hospital | మేము సమకూరిస్తే.. మీరు శంకుస్థాపనలు చేస్తారా..

Hospital | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : జిల్లా జైలు పూర్తయి రెండేళ్లు అయ్యింది.. ఇప్పుడు మీరు వచ్చి ప్రారంభిస్తున్నారు… శ్రమ మాది… శిలాఫలకం మీరు వేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముందుచూపుతో నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ప్రణాళికలు చేశామన్నారు. తాము అన్ని సమకూర్చడం.. మీరు శంకుస్థాపనలు చేయడం అన్నారు.

ఆయుష్ ఆస్పత్రులు మేమే ఏర్పాటు చేశామన్నారు. నడుస్తున్న ఆయుష్ ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. పీహెచ్‌సీలు కూడా తాను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడే ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ వల్ల పీహెచ్‌సీలు ప్రారంభించలేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జిల్లా జైలుకు భూసేకరణ చేశాం..నిధులు కేటాయించామన్నారు. శ్రమ ఎవరిది.. శిలాఫలకం ఎవరిది? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇప్పటికీ రుణమాఫీ పూర్తి కాలేదన్నారు. నర్మెట్టలోనే 350మంది రైతులకు రుణమాఫీ అవ్వలేదన్నారు.

సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మందికి రుణమాఫీ కాలేదన్నారు. మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారన్నారు. రైతుబంధు బకాయిలు వెంటనే ఇవ్వాలని రైతుల తరఫున అడుగుతున్నానన్నారు. పంటల బీమా ఇప్పటికీ చేయించలేదన్నారు. వర్షాలు, తుపానుల వల్ల నష్టపోయిన పంటలకు బీమా రాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిద్దిపేటకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు ఆరోపణలు చేశారు.

Leave a Reply