ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు..

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు..

నార్సింగి, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసం మానవత్వాన్ని మేల్కొలిపే ఆధ్యాత్మిక యాత్ర అని నార్సింగి గ్రామ సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పవిత్ర కాలం మనుషుల మధ్య ప్రేమ, దయ, సహనం, సోదరభావం పెంపొందించే గొప్ప అవకాశమని అన్నారు. నెల రోజులపాటు కఠిన ఉపవాస దీక్షతో ఆత్మశుద్ధి సాధించిన ప్రతి ఒక్కరికీ ఈద్-ఉల్-ఫితర్ ఆనందం మరింత ప్రత్యేకమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటూ ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అల్లా దీవెనలు ప్రతి ఇంటిని ఆనందంతో నింపాలని, సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం విరాజిల్లాలని సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్.మన లక్ష్యం మనసారా కోరుకున్నారు.