ర్యాష్ డ్రైవింగ్, ముగ్గురిపై కేసులు నమోదు..

ర్యాష్ డ్రైవింగ్, ముగ్గురిపై కేసులు నమోదు..
ఏటూరు నాగారం, ఆంధ్రప్రభ : ఏటూరునాగారం మండలంలో ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడిన ముగ్గురు యువకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఏటూరునాగారం ఎస్సై మహేశ్ తెలిపారు. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అతివేగం, అజాగ్రత్తగా బైక్ నడుపుతున్న సాయికిషన్, శ్రీనివాస్, కమలేష్ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మోటారు వాహన చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్సై మహేశ్ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
