ఘనంగా శోభన్ బాబు వర్ధంతి వేడుకలు

ఘనంగా శోభన్ బాబు వర్ధంతి వేడుకలు

కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ : నట భూషణ్ శోభన్ బాబు18వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ శోభన్ సర్కిల్ వద్ద స్టేట్ వైడ్ శోభన్ సిండికేట్ అధ్యక్ష కార్యదర్సులు డాక్టర్ కళ్లేపల్లి మధుసూధనరాజు, డాక్టర్ దారా సత్యనారాయణ ఆధ్వర్యంలో అందాల నటుడు శోభన్ బాబు వర్ధంతి కార్యక్రమాన్ని అభిమానుల మధ్యన ఘనంగా నివాళులు అర్పించారు, శోభన్ విగ్రహనికి పూల మాలలు వేసి, పేదలకు మిట్టాయి పంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో AP ఎన్ జి వో స్ ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైసింగ్ సెక్రటరీ బండి వెంకట రమణ, కళ్లేపల్లి మధుసూదన్ రాజు, ధార సత్యం మాట్లాడుతూ అభిమానుల గుండెల్లో చెరగని అందాల నటుడు ముద్ర వేసుకొని, నేటికీ అందాల నటుడు గానే మిగిలారని చెప్పారు. చని పోయి 18 సంవత్సరాలయినా నేటికీ పలు సేవా కార్యక్రమాలు చెయ్యటం అభినందించ దగ్గ విషయం అన్నారు, అధ్యక్ష, కార్యదర్సులు మధుసూధనరాజు, ధారా సత్యనారాయణ మాట్లాడుతూ సంక్రాంతి కి ఉదయించి ఉగాది కి అస్తమించి శోభన్ జీవితం ఎప్పటికీ పండుగేనని, మరిచిపోలేని విధంగా అభిమానుల గుండెల్లో నిలిచారని, ఈ సెంటర్ కీ శోభన్ బాబు సర్కిల్ గా నామకరణం చేయమని ప్రభత్వాని కోరామని, ఇంకా పలు సేవా కార్యక్రమాలు స్టేట్ వైడ్ శోభన్ సిండికేట్ సంస్థ ద్వారా చెయ్యబోతామని, చేస్తామని, క్రమశిక్షణకు మారు పేరని శోభన్ అభిమానులని గర్వం గా చెప్పుకుంటున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జి. ప్రభాకర్. కె.జగన్ మోహన్ రావు, ఆర్టిస్ట్ వెంకటేశ్వర రావు, నాగేశ్వరావు (గుంటూరు), ఆంజనేయులు, ఏం. శ్రీనివాసరావు , కాశీబోట్ల వెంకటేశ్వర్లు, రైల్వే త్రినాధ్, హేమంత్ రైల్వే లైన్స్ ఎలక్ట్రీషియన్ రామకృష్ణ, ప్రభల శ్రీనివాస్, జయ ప్రభు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply