ఉగాది పర్వదిన శుభాకాంక్షలు..

ఉగాది పర్వదిన శుభాకాంక్షలు..

ములకలపల్లి, ఆంధ్రప్రభ : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తిమ్మంపేట గ్రామపంచాయతీ సర్పంచ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. ఉగాది పచ్చడిలాగే మీ జీవితం కూడా షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

శ్రీ క్రోధి నామ సంవత్సరం మరింత శోభాయమానంగా విరాజిల్లాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులు పాడి పంటలతో ఆనందంగా వర్ధిల్లాలన్నారు. ఈ ఏడాదిలో అన్నింటా శుభం జరగాలని, కొత్త సంవత్సరం అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తుర్రం శ్రీనివాసరావు తెలిపారు.

Leave a Reply