మైనార్టీల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయం…

మైనార్టీల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయం…
రంజాన్ పండుగ కానుకగా మౌజాన్లు ఇమామ్ లకు నిధులు విడుదల..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమమే ధ్యేయం గా టిడిపి పార్టీ కృషి చేస్తుందని ఎందుకు నిదర్శనంగా రంజాన్ పండుగ ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం విడుదల చేయటంపై ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మండలంలోని పులిమద్ది గ్రామం మసీదు ముత్త వల్లి షేక్ హుస్సేన్ రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ఘనంగా సన్మానించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనూ జిల్లాలోని మౌజన్లు, ఇమామ్‌లకు ఆరు నెలల గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
ఇమామ్‌లకు నెలకు 10 వేల రూపాయలు మౌజన్లకు నెలకు 5 వెల రూపాయలు చొప్పున గత ఏడాది అక్టోబరు నుండి ఈనెల మార్చి వరకు ఉన్న బకాయి మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడంపై ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తున్నా రు. మైనారిటీల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తునన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ కు పులిమద్ది గ్రామ ముత్తవల్లి షేక్ హుస్సేన్ గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలోని కూడా టిడిపి ప్రభుత్వము ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేసిందని వారు పేర్కొన్నారు. ముస్లింల మైనార్టీ ఓటు బ్యాంకు టిడిపి పార్టీకి గణనీయంగా పెరుగుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
