రాష్ట్ర క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ శాప్ ఆధ్వర్యంలో వైస్సార్ కడప జిల్లా పుట్నంపల్లిలో నిర్వహిస్తున్న రాష్ట్ర క్రీడా పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ భరణి తెలిపారు.
4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేపడుతున్నట్లు తెలిపారు. 4వ నుంచి 6వ తరగతుల వరకు చదువు తున్న విద్యార్థులు జిల్లా రాష్ట్ర స్థాయి ఎంపిక జరుగుతుందన్నారు.7వ నుంచి 9వ తరగతుల వరకు రాష్ట్ర స్థాయి ఎంపిక చేపట్టినట్లు వెల్లడించారు.
ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు..దరఖాస్తుల జూన్ నెల 2వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. అధికారిక వెబ్‌సైట్ ఏపీ స్పోర్ట్స్ స్కూల్ .ఏపీ .గవర్నమెంట్ .ఇన్ ద్వార దరఖాస్తు చేసుకోవాలన్నారు.
