నవోదయ ఎంట్రన్స్ లో ఫరియాకు 95వ ర్యాంకు

నవోదయ ఎంట్రన్స్ లో ఫరియాకు 95వ ర్యాంకు
అమరావతి, ఆంధ్రప్రభ : అమరావతి మండలములోని మునుగోడు మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ పాఠశాల నందు 5వతరగతి చదువుతున్న షేక్ ఫరియా2026 27విద్యాసంవత్సరానికి గాను నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో 95వ ర్యాంకుతో సీటు సాధించింది.
షేక్ ఫరియా విద్యార్ధికి, వారి తల్లి దండ్రులు షేక్ దావూద్, చోటి మీరాబీ కి పాఠశాల ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖాది కారులైన సి. హెచ్.శివబాబు, కంచర్ల ప్రసాద్ మంగళవారం రాత్రి అభినందనలు తెలియజేశారు.
