ప్రాణాలు పోయిన పట్టించుకోరా..

ప్రాణాలు పోయిన పట్టించుకోరా..

పులి సంచారంతో భయం గుప్పిట్లో ప్రజలు, రైతులు

జగిత్యాల జిల్లా, ఆంధ్రప్రభ : పులిని బంధించి సురక్షితమైన ప్రాంతానికి తరిలించాలని అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్-జగిత్యాల జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కోడిమ్యాల మండలం గంగారాం తండాలో పులి భయం ఉద్ధృతమవుతుండగా, అటవీ అధికారుల నిర్లక్ష్యంపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పులి ని అటవీశాఖ అధికారులు వెంటనే బంధించి సురక్షితమైన ప్రాంతం తరలించాలని, బుధవారం జగిత్యాల జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ దావ వసంత, టిఆర్ఎస్ నాయకులతో కలిసి జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ గారికి వినతి పత్రం ఇచ్చారు.

గత ఏడాది కాలంగా చొప్పదండి నియోజకవర్గం లోని కొడిమ్యాల మండలం, సిరిసిల్ల సిద్దిపేట భువనగిరి ప్రాంతాలలో, సంచరిస్తూ, సుమారు 20 దాకా పశువులను చంపి తిని, గత నాలుగు రోజులుగా కొడిమ్యాల ప్రాంతంలో తిరుగుతూ పశువులపై దాడులు చేస్తున్న పులి, మృతి చెందిన ఆవును తినడానికి వరుసగా రెండు రోజులుగా వస్తున్నప్పటికీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని సుంకె తీవ్రంగా మండిపడ్డారు.

సీసీ కెమెరాల్లో పులి కదలికలు స్పష్టంగా రికార్డు అయినా, పులి సంచారం నిర్ధారణ అయినా కూడా అధికారులు కేవలం నామమాత్రపు హాజరు చూపుతూ వెళ్లిపోతున్నారని, “అటు వెళ్లకండి” అంటూ హెచ్చరించడం తప్ప భద్రతా చర్యలు ఏవీ కనిపించడం లేదని, విమర్శించారు. మృతి చెందిన ఆవులను ఎక్కడివి అక్కడే వదిలేయడం మరింత ప్రమాదకర పరిస్థితికి దారితీస్తోందని అయన ఆందోళన వ్యక్తం చేసారు. అవి కుళ్లిపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉండటంతో పాటు, కుక్కలు వాటిని తిని గ్రామంలోకి వస్తే వ్యాధులు ప్రబలే ముప్పు ఉందని హెచ్చరించారు.

ఇక ఒకవైపు నీటి సమస్య, మరోవైపు పులి భయం కారణంగా రైతులు తమ పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని,పంటలకు నీరు పెట్టలేక పంటలు ఎండిపోతుండటంతో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా నామమాత్రపు చర్యలు మానుకుని పులిని వెంటనే పట్టుకుని ఈ ప్రాంతానికి పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. వీరితోపాటు జగిత్యాల జిల్లా మాజీ చైర్మన్ దావా వసంత, కొడిమ్యాల మండల బిఆర్ఎస్ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్,యూత్ అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షులు కొత్తూరు స్వామి, నాయకులు బొజ్జ పవన్,నజీర్,ఆదిమల్లు, అజ్జు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply