జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు
జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు
పెద్దపల్లి ఆంధ్రప్రభ : భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ జయంతి (Gandhi Jayanti) వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ… గాంధీజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అహింసా మార్గంలో బ్రిటిష్ వారితో పోరాడి భారతదేశానికి స్వాతంత్రం అందించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు.
కలెక్టరేట్ ఆవరణతో పాటు రామగుండం పోలీస్ కమిషనరేట్ (Police Commissionerate) ఆవరణలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు.

