Hostel | ఆత్మహత్య చేసుకున్న టెన్త్ విద్యార్థి

Hostel | ఆత్మహత్య చేసుకున్న టెన్త్ విద్యార్థి

చెరువులో విగతజీవిగా మారిన రాకేశ్‌
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

Hostel | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆశల పల్లకిలో ఊరేగాల్సిన ఆ చిన్నారి.. అనంత వాయువుల్లో కలిసిపోయాడు. పదో తరగతి పరీక్షల్లో మొదటి మెట్టు సరిగ్గా వేయలేకపోయానన్న చిన్న ఆందోళన.. తన నిండు ప్రాణాన్ని బలితీసుకునేలా చేసింది. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన విద్యార్థి మండల రాకేశ్‌ (15), బుధవారం ఉదయం వట్టిచెరుకూరు గ్రామ సమీపంలోని చెరువులో శవమై తేలడం స్థానికులను కలచివేసింది.

Hostel | విషాద గమనం..

Hostel |

పల్నాడు జిల్లా నాగులవరం గ్రామానికి చెందిన రాకేశ్‌, వట్టిచెరుకూరులోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం జరిగిన తెలుగు పరీక్ష సరిగ్గా రాయలేదని ఆ రాత్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వార్డెన్‌, వాచ్‌మెన్‌ ధైర్యం చెప్పినా.. ఆ పిల్లాడి మనసులో ఏదో తెలియని భయం గూడుకట్టుకుంది. మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లిన రాకేశ్‌.. చివరకు మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు.

Hostel | చెరువులో తేలిన మృతదేహం…

బుధవారం ఉదయం 10 గంటల సమయంలో స్థానిక చెరువులో ఒక బాలుడి మృతదేహం తేలియాడుతుండటాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయగా.. అది అదృశ్యమైన రాకేశ్‌దేనని గుర్తించారు. తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఆశపడిన ఆ తల్లిదండ్రులు, బాబు మృతదేహాన్ని చూసి అక్కడే కుప్పకూలిపోయారు. వారి రోదనలు చూసి అక్కడున్న వారందరి కళ్లు చెమర్చాయి. ఒక్క పరీక్ష తప్పితే జీవితమే పోతుందా నాయనా.. నీవు ఉంటే చాలు అనుకున్నాం కదా.. అంటూ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కన్నీరు పెట్టించింది.

Hostel | పోలీసుల దర్యాప్తు..

వట్టిచెరుకూరు సీఐ ఎం. రామ నాయక్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కె. శివశంకర రావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. మార్కుల కంటే ప్రాణం మిన్న అని, ఒక్క పరీక్ష జీవితాన్ని శాసించదని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు నిరంతరం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Hostel | మంత్రి సవిత ఆవేదన..

బీసీ హాస్టల్ విద్యార్థి రాకేష్ పరీక్షల భయంతో ఆత్మహత్య చేసుకోవడం పట్ల బీసీ సంక్షేమ శాఖా మంత్రి సవిత తీవ్ర ఆందోళన చెందారు. విద్యార్థుల్లో భరోసా నింపేలా ఉపాధ్యాయులు, తల్లి,దండ్రులు తరచూ కౌన్సిలింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాకేష్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

click here to read more : Scooty | స్కూటీ ఢీకొని వృద్ధ కార్మికుడు మృతి..

click here to read more

Leave a Reply