ఇసుక తరలింపును అడ్డుకున్న వేల్పూర్ గ్రామస్తులు..

ఇసుక తరలింపును అడ్డుకున్న వేల్పూర్ గ్రామస్తులు..

కులాల వారిగా భారీగా సంఖ్యలు ర్యాలీ నిరసన ధర్నా..

వేల్పూర్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ కేంద్రంలొ బుధవారం రోజున తమ గ్రామ వనరులైన ఇసుక తరలింపును చెందని ఇతర గ్రామాలు తమ గ్రామం నుండి ఇసుక తీసుక వెళ్ళవద్దని నడుకుడ బ్రిడ్జి వద్ద గ్రామ రైతులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమనికి వేల్పూర్ యావత్ రైతుల సంఘాలు గ్రామ గ్రామస్తు భారీ ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయలానికి తరలి వచ్చి స్థానిక తహసిల్దార్ అనిరుద్ కు వినతి పత్రం అందజేశారు..

ఈ సందర్భంగా తహసిల్దార్ అనిరుద్ మాట్లాడుతూ గ్రామ ఇసుక వినియోగ విషయమై జిల్లా కలెక్టర్ కు ఇసుక వాడక విషయమై గ్రామ రైతుల సమాచారాన్ని సమస్యలని కలెక్టర్ కి చేరవేసి సమస్య పైన పరిష్కారము చేయుటకు కొంత సమయం కావాలని వేల్పుర్ గ్రామస్తులు రైతులతో కోరారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వేల్పూర్ వనరు అయిన ఇసుక ను తమ గ్రామాల నుండి ఇతర గ్రామాలకు ఇసుకను తీసుకువెళ్ల వద్దని భూగర్భ జలాలు తీవ్రమైన కరువు ఏర్పడుతుందని సాగునీరు తాగునీరు పశువులకు తీవ్రమైనటువంటి నీటి కొరత ఏర్పడడం చేత గ్రామస్తులకు రైతులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడటం చేత కచ్చితంగా ఇట్టి ఇసుక రవాణాను తక్షణమే నిలిపివేయాలని రైతులు గ్రామస్తులు డిమాండ్ చేశారు

Leave a Reply