వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడి నిరసన…

బిక్కనూరు, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో సోమవారం ఒక యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు పూర్తి వివరాలు గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ రమేష్ అదే గ్రామానికి చెందిన ఒక మహిళను మానసికంగా వేధిస్తున్నాడని మహిళా భర్త ఆస రాకేష్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేశారు.
తమకు న్యాయం చేయాలని లేదంటే వాటర్ ట్యాంక్ నుండి కింద దూకి చనిపోతానని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా తమ భార్యను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఏఎస్ఐ వెంకటరావు గ్రామానికి చేరుకుని వాటర్ ట్యాంక్ పైన ఉన్న రాకేష్ కు ఫోన్ చేసి బుజ్జగించి కిందికి దించారు. అనంతరం బాధితురాలు నుండి ఫిర్యాదు తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
