రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివి..

భీమ్‌గల్ టౌన్ , ఆంధ్రప్రభ : ఆధునిక భారతదేశ నిర్మాణానికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివని భీమ్‌గల్ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ , పట్టణ అధ్యక్షుడు పర్శ అనంత రావు అన్నారు . శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

వారు మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెనకబడిన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్‌ గాంధీనే అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply