Power star | ఈ నిర్మాతకు ఓకే చెప్పారా..?
Power star | ఈ నిర్మాతకు ఓకే చెప్పారా..?
Power star | పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై ఆసక్తికర అప్డేట్స్
సురేందర్ రెడ్డితో భారీ ప్రాజెక్ట్ సిద్ధం
మోహన్ రాజాతో కొత్త సినిమా గ్రీన్ సిగ్నల్?
విశ్వప్రసాద్ బ్యానర్లో ప్రాజెక్ట్ చర్చలు
45 రోజుల కాల్షీట్లు ప్లాన్ చేస్తున్న పవన్
తని ఒరువన్ దర్శకుడితో క్రేజీ కాంబినేషన్
ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత తదుపరి ప్రాజెక్ట్ ఏది?
Power star | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. తన ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ సినిమాని ప్రకటించారు. ఇప్పుడు మరో సినిమాకి ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. అది కూడా కోలీవుడ్ (Kollywood) డైరెక్టర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. అలాగే ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ నిర్మాతకు ఈ సినిమా చేయనున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇంతకీ.. పవన్ ఓకే చెప్పిన ఆ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఎవరు..? ఈ మూవీ పట్టాలెక్కేది ఎప్పుడు..?
Power star | పవన్, సురేందర్ రెడ్డి సినిమా..
పవన్ కళ్యాణ్ నుంచి గత సంవత్సరం రెండు సినిమాలు వచ్చాయి. అందులో వీరమల్లు ప్లాప్ అయ్యింది.. ఓజీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించడం.. టీజర్ (Teaser) అండ్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల పవన్ కళ్యాణ్.. సురేందర్ రెడ్డితో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి వక్కంతం వంశీ కథను అందించారు. ఈ భారీ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రానుంది.

Power star | పవన్, మోహన్ రాజా మూవీ..
ఇప్పుడు మరో సినిమాకి ఓకే చెప్పడం ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్.. పీపుల్ మీడియా అధినేత విశ్వప్రసాద్ కు ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారు. పవన్ (Pawan) తో సినిమా కోసం విశ్వప్రసాద్ పలువురు దర్శకులను పవన్ దగ్గరకి పంపితే.. ఏ కథ పవన్ కు నచ్చలేదట. రీసెంట్ గా కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఓ కథ చెప్పారట. ఈ కథ పవన్ కు నచ్చిందని టాక్ వినిపిస్తోంది. మోహన్ రాజా మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ మూవీ తెరకెక్కించారు. ఆయన చాలా స్టైలీష్ గా సినిమాలు తీస్తాడు.. అలాగే తక్కువ టైమ్ లో తీస్తాడనే పేరుంది.

Power star | 45 రోజులు మాత్రమే..
మోహన్ రాజా.. తని ఓరువన్ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమానే తెలుగులో రామ్ చరణ్ తో ధృవ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. తక్కువ టైమ్ లోనే సినిమా కంప్లీట్ చేస్తాడని పేరు ఉండడం.. పవన్ కూడా తక్కువ టైమ్ లో తీసే డైరెక్టర్ (Director) కోసం చూస్తుండడం.. కథ కూడా బాగుండడంతో ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ చేసారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం 45 రోజులు కాల్షీట్లు ఇచ్చారు. ఈ సినిమా కోసం కూడా 45 రోజులు కాల్షీట్లు ఇవ్వాలి అనుకుంటున్నారట. ప్రస్తుతం మోహన్ రాజా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారట. సురేందర్ రెడ్డితో చేసే సినిమా కంప్లీట్ చేసి ఈ మూవీని స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. మరి.. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

