కాలుష్యం బారి నుండి కాపాడాలని కలెక్టర్‌కు వినతి

కాలుష్యం బారి నుండి కాపాడాలని కలెక్టర్‌కు వినతి

కాలుష్యాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం

యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిసరాలలో నెలకొల్పిన కాలుష్యకారక పరిశ్రమల నుండి తమను కాపాడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ని కోరుతూ బాధిత మహిళా రైతులు, ప్రజలు వినతి పత్రం అందజేశారు. కాలుష్య బాధిత రైతులు ముందుగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ని కలిసి కాలుష్యం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను తొలగించాలని వేడుకోగా ఆయన జిల్లా కలెక్టర్ తో, పి సి పి మెంబర్ సెక్రటరీ తో మాట్లాడారు. ఎంపీ సూచన మేరకు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ను కలిశారు.

జిల్లా కలెక్టర్ బాధిత గ్రామస్తుల నుండి కాలుష్యం వివరాలు పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పటి నుండి కాలుష్యం క్రమంగా పెరిగిందని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేయగా తప్పుడు నివేదికలిస్తూ పరిశ్రమలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశ్రమల కాలుష్యాన్ని నిర్ధారించిన నివేదికలను అందజేసినారు. పరిశ్రమలు కాలుష్యానికి పాల్పడినట్లుగా నిర్ధారణ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ కాలుష్య పరిశ్రమలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ సమీపంలోని అన్నిపరిశ్రమల నుండి కాలుష్యం జరుగుతుందని, ముఖ్యంగా హజలో లాబరేటరీ నుండి విపరీతమైన వాసన వస్తున్నట్లుగా తెలియజేస్తూ అధికారులు ఇచ్చిన నివేదికలు సమర్పించారు. గ్రామంలో ఉన్న ఎంత మంది ప్రజలు, ఎన్ని ఎకరాల భూమి కాలుష్యం కారణంగా ప్రభావితమైతుందో కలెక్టర్ గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన రిపోర్టుని పూర్తిగా పరిశీలించి సమస్యను పరిష్కరించుటకు కృషి చేస్తానని గ్రామస్తులతో కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలుష్యం బాధితులు రావుల ధనలక్ష్మి, స్వప్న, అమృత, వస్పరి ప్రభ, రేణుక, శారదమ్మ, బుచ్చమ్మ, సత్తమ్మ, భారతమ్మ, కిష్టమ్మ, ముత్తమ్మ, జంగమ్మ, రాములమ్మ, ఇందిరమ్మ, పూజాత, మల్లమ్మ, సుగుణమ్మ, కమలమ్మ, లావణ్య, జంగమ్మ, సత్తమ్మ, సుజాత, లక్ష్మమ్మ, పద్మమ్మ, శివమ్మ, అమృత, శశిరేఖ, బీరమ్మ, దామోదర్ రెడ్డి, శశికిరణ్, శివరాజ్, రామ్ రెడ్డి, బాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరసింహ, లింగయ్య, మహేష్, రమేష్, చిన్నప్ప, రవీందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply