ఆసుపత్రిని పూర్తి చేయాలని ధర్నా..

ఆసుపత్రిని పూర్తి చేయాలని ధర్నా..

యాదాద్రి జిల్లా కలెక్టర్ కు వినతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి అన్ని సదుపాయాలతో ప్రారంభించాలని, అన్ని రకాల వైద్యులతో ఆసుపత్రి కి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చౌటుప్పల్ పరిసర ప్రాంతాలలో 8 మండలాల ప్రజలు, చౌటుప్పల్ నుండి హైవే రోడ్డు ఉండడంవల్ల, అనేక వాహన ప్రమాదాలు జరుగుతుండడంతో, ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యము లేక, అటు హైదరాబాదుకు వెళ్లి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక ఆర్థిక భారంతో సరైన సమయానికి ఆసుపత్రికి చేరలేక మరణించడం జరుగుతుంది.

ఆ ఉద్దేశంతోనే గత ప్రభుత్వం 36 కోట్ల తో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. కానీ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల సంవత్సరాలు గడుస్తున్న ఆస్పత్రి ప్రారంభానికి నోచుకోలేక పోతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరగా పూర్తిచేసి అన్ని రకాల వైద్యులను, నియమించి వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాసు, నాయకులు ఎండి పాషా, అవ్వారి రామేశ్వరి, బండారు నరసింహ, బత్తుల దాసు, ఆదిమూలం నందీశ్వర్, ఆకుల ధర్మయ్య, కందగట్ల ఆనంద్, సప్పిడి శ్రీనివాసరెడ్డి, చికూరు ఈదయ్య, మొగుదాల రాములు, ఎండి జానీ, సోమరాజ్, యాదయ్య, పంతంగి సంధ్య సుర్వి వెంకటేష్, యాదమ్మ, సుర్వి జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply