18వ తేదీన ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ ఇఫ్తార్ విందు ఏర్పాటు…

18వ తేదీన ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ ఇఫ్తార్ విందు ఏర్పాటు…
కృష్ణలంక విజయవాడ తూర్పు, ఆంధ్రప్రభ : వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు విజయవాడ లబ్బీపేట ఎస్.ఎస్.కన్వెన్షన్ హాల్ వేదికగా ఇఫ్తార్ విందు.ఇఫ్తార్ విందు ఏర్పాట్లకు ఎస్ ఎస్ హాల్ ను పరిశీలించిన ఎమ్మెల్సీ తలశీల రఘురామ్,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, వైసిపి మైనార్టీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ మాట్లాడుతూ ఈ నేల 18 వ తేదీన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరుపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఇఫ్తార్ విందుకి మైనారిటీ సోదరులు అందరూ తరలిరావాలని ఆయన కోరారు.
