భవన నిర్మాణానికి భూమి కేటాయించాలని వినతి

భవన నిర్మాణానికి భూమి కేటాయించాలని వినతి

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండల కేంద్రంలో మహిళా సంఘాల భవనం నిర్మించేందుకు భూమి కేటాయించాలని కోరుతూ ఎమ్మార్వోకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. మండలంలోని ఆరు మహిళా సంఘాల తరఫున ప్రతినిధులు ఎమ్మార్వోను కలిసి తమ సమస్యను వివరించి, సంఘాల కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రత్యేక భవనం అవసరమని తెలిపారు.

మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక స్థిరమైన భవనం ఉండటం అవసరమని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిని కేటాయించి మహిళా సంఘ భవనం నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం శ్రీధర్, ఉప సర్పంచ్ మహేష్, వార్డ్ మెంబర్లు బొనగం రమేష్, తిప్పారపు మహేష్, ఐలేని విజయ నర్సింహారెడ్డి, సీఏలు నీరజ, విజయ, లత తదితరులు పాల్గొన్నారు.