టీకా కార్యక్రమం ప్రారంభం
టీకా కార్యక్రమం ప్రారంభం
మొవ్వ – ఆంధ్రప్రభ : మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలో జంతువులకు సోకే గాలికుంటు వ్యాధి నివారణ కోసం నిర్వహిస్తున్న అవగాహన పోస్టర్ విడుదల, టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్, మొవ్వ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లింగమనేని రామలింగేశ్వరరావు సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ పాడి రైతులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమం పై పూర్తి అవగాహన పొంది, తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని కోరారు.
అలాగే గాలికుంటు వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 16-03-2026 నుండి 14-04-2026 వరకు అందరూ సద్వినియోగం చేసుకుని, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని తమ పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప్పలపాటి నాగ లక్ష్మిప్రసన్న, మొవ్వ ఏవీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె.రవీంద్రరావు, మండల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎం. మౌర్య సత్యేంద్ర, సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
