10వ తరగతి పరీక్షలు ప్రారంభం..

10వ తరగతి పరీక్షలు ప్రారంభం..

గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడలో 10 వ తరగతి పరీక్షలకు 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం వద్ద హాల్ టికెట్ నంబర్ల రూమ్ లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. 10వ తరగతి పరీక్షలకు పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు చేరుకున్నారు. 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు.

Leave a Reply