మొబైల్ మెడికల్ క్యాంపునకు విశేష స్పందన..

మొబైల్ మెడికల్ క్యాంపునకు విశేష స్పందన..
భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఆదివారం 43 వ డివిజన్ ఊర్మిళా నగర్ పార్క్ సెంటర్ సచివాలయం వద్ద క్యాంపు నిర్వహి నిర్వహించారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మెడికల్ క్యాంపు లో పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయం పొందారు.. ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, ఎక్స్ రే, 2డీ ఎకో , అల్ట్రా స్కానింగ్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు..
పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారి సిబ్బంది, టెక్నిషియన్స్, వైద్యులు క్యాంపుకు సహకరించారు. అమరావతి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా ప్రభుత్వ దంత వైద్యశాల వారిచే దంత సమస్యలు ఉన్న వారికి దంత పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన వైద్య సహాయం కూడా అంద చేశారు.. జనసేన డివిజన్ అధ్యక్షులు కోటి, వీరమహిళ శ్రీదేవి, కూటమి నాయకులు, సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు వెంకట రమణ, హరీష్ లతో పాటు సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.



