నిత్య కృషీవలుడు ముఖ్యమంత్రి చంద్రబాబు..

నిత్య కృషీవలుడు ముఖ్యమంత్రి చంద్రబాబు..

పాయకాపురం, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, నవ్యాంధ్ర నిర్మాత, నిత్య కృషివలుడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, విజినరీ లీడర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని 61 డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శాంతినగర్ లోని భాస్కరరావు కొట్టు సెంటర్ నందు కేక్ కటింగ్, చీరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాండా ఉమా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ఉభయసభల్లో (పార్లమెంట్, రాజ్యసభ) చట్టం చేసిన ధీరుడు, విజినరీ లీడర్, నిత్య కృషివలుడు, రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దులుగా పరుగులు తీపిస్తూ దేశంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలోకి తీసుకెళ్లే విధంగా నిత్యం కష్టపడుతున్న చంద్రబాబునాయుడు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షుడు ఆకుల సూర్యప్రకాష్,డివిజన్ క్లస్టర్ ఇన్చార్జి దాసరి కనకారావు, ప్రధాన కార్యదర్శి, ఇంచార్జి,బూత్ కన్వీనర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళలు, జనసేన, బిజెపి, ఎన్డీఏ కూటమి ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక బి. ఆర్. టి. ఎస్ రోడ్డులో సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో శీలం నాగేశ్వరరావు, నవణితం సాంబశివరావు, బొర్రా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply