రోడ్డు పక్కన ఆక్రమణల తొలగింపు..

రోడ్డు పక్కన ఆక్రమణల తొలగింపు..

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : టాక్టికల్ అర్బనిజంలో భాగంగా రోడ్డుకిరువైపులా అక్రమణలను ఇబ్రహీంపట్నం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు తొలగించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షరిన్ బేగం సూచనలత ఏడీసీపీ జి.రామకృష్ణ పర్యవేక్షణలో లా అండ్ ఆర్డర్ సీఐ సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ సిబ్బందితో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్, కొండపల్లి బ్యాంక్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో రోడ్డుకిరువైపులా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న వివిధ రకాల అక్రమణలను తొలగించారు. రోడ్డు పై అడ్డదిడ్డంగా పెట్టి విక్రయిస్తున్న వివిధ వస్తువులను తొలగించి వ్యాపారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఎస్సై వి.లక్ష్మణరావు, మున్సిపాలిటీ సిబ్బంది, ఎన్ హెచ్ఏఐ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply