రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం…
- ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
తిరువూరు, ఆధ్రప్రభ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అన్నారు. అన్నదాత-సుఖీభవ పీ ఎం కిసాన్ 3వ విడత, 22 వ విడత నిధులు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన నియోజక వర్గ స్థాయి కార్యక్రమం తిరువూరు మండలంలోని మల్లేల ప్రాథమిక సహకార పరపతి సంఘం టెలికాస్ట్ చేయబడిందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పీఎం కిసాన్ పథకం కింద మూడో విడత కేంద్రం ఇచ్చిన నిధులు రూ 2000/-, రాష్ట్ర ప్రభుత్వం రూ 4000/- తో కలిసి మొత్తం రూ 6000/- విడుదల అయ్యాయి అన్నారు. రైతుకు పెట్టుబడి సాయం కింద అందించిన ఈ నిధులతో రైతన్నలకు కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ఎమ్మెల్యే కొలికపూడి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ఆర్డీవో పోసి బాబు, నియోజక వర్గం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస నాయక్, తహసీల్దార్ వైకుంఠరావు, తిరువూరు ఇంచార్జి ఏడీఏ పీ పద్మ, వ్యవసాయ శాఖ సిబ్బంది, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
