పారిశుద్ధ్య కార్మికులకు, సఫాయి మిత్ర వారికి సురక్ష శిభిరం

పారిశుద్ధ్య కార్మికులకు, సఫాయి మిత్ర వారికి సురక్ష శిభిరం

స్వయం సహాయక బృందాల మహిళలకు “డిజిటల్‌ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
సి.డి.ఓ, ఉమామహేశ్వరి

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్ర ప్రభ : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాల్లో భాగంగా “నారి నాయకత్వంలో స్వచ్ఛత” కార్యక్రమాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేకంగా “సఫాయి మిత్ర సురక్ష శిబిర్” శిక్షణ కార్యక్రమాలను న నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నామని సి.డి.ఓ,ఉమామహేశ్వరి అన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ కోసం సఫాయి మిత్ర సురక్ష శిబిరాలను నిర్వహించి వారికి ఆరోగ్య పరీక్షలు చేసి, ఆరోగ్యంతో పౌష్టిక ఆహారంతో ఎలా ఉండాలి వంటి అంశాలపై అవగాహన కల్పించి, వారి అనారోగ్య సమస్యలకు చికిత్స నిమిత్తం మందులను పంపిణీ చేశారు. ఆధునిక సాంకేతికత వినియోగంపై వారికి స్వయం సహాయక బృందాల మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా విజువల్ లిటరసీ ద్వారా మొబైల్ ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాల్సిన అంశాలను వివరించారు. తెలియని లింకుల పై క్లిక్ చేయకూడదని, సైబర్ మోసాల నుండి ఎలా రక్షించు కోవాలో వారికి అవగాహన కల్పించారు.అలాగే డిజిటల్ లావాదేవీల పై కూడా శిక్షణ ఇచ్చి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఖాతాలో డబ్బులు ఎలా జమ చేయాలి, ఒకరి ఖాతా నుండి మరొకరి ఖాతాకు సురక్షితంగా డబ్బులు ఎలా బదిలీ చేయాలి వంటి అంశాలను ప్రదర్శనల ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు, స్వయం సహాయక బృందాల మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply