Highway-48 | భయంతో పరుగులు పెట్టిన జనం

Highway-48 | భయంతో పరుగులు పెట్టిన జనం
Highway-48 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టిన ఘటన రాజస్థాన్ లోని కిషన్గఢ్లో చోటుచేసుకుంది. జైపూర్–అజ్మేర్ నేషనల్ హైవే-48పై గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపు తప్పి పల్టీ కొట్టింది. కిషన్‌గఢ్ టోల్ సమీపంలోని చిడియా బావడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల అప్రమత్తంతో భారీ ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
బర్నా గ్రామం నుండి కిషన్‌గఢ్ వైపు సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కు.. జాతీయ రహదారిపై అకస్మాత్తుగా, టైర్ పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అదుపు తప్పిన లారీ రోడ్డుపై పల్టీ కొట్టినట్లు సమాచారం. వాహనం పడిపోవడంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లు హైవేపై నలువైపులా చెల్లాచెదురుగా పడ్డాయి. అవి ఎక్కడ పేలుతాయోనని స్థానికులు, వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే అతన్ని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. లారీ బోల్తాపడడంతో ఓ వైపు గ్యాస్ కొరత ఉండడం.. మరో వైపు సిలిండర్లు పేలుతాయేమోననే భయంతో ప్రజలు అర్థంకాక పరుగులు తీశారు.
