ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఘంటసాల, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామ శివారు శీలంవారిపాలెంలో ఘనంగా జరిగాయి. ఘంటసాల మండల పార్టీ, శీలం వారిపాలెం జనసైనికుల ఆర్ద్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ కేక్ కట్ చేశారు. మండల ఉపాధ్యక్షులు సుగ్గన పవన్ కుమార్, వైస్ డీసీ సుగ్గున రాంబాబు స్కూల్ పిల్లలకి బాగ్స్ బుక్స్ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలి వెంకట్రామ్ చేతుల మీదగా పలువురు సభ్యత్వాలు తీసుకున్నారు. మొత్తం ఈ కార్యక్రమంలో స్వీట్స్ , మజ్జిగ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ, సర్పంచ్ అంకం మారుతీ రావు, మండల పార్టీ అధ్యక్షులు కోన రాజశేఖర్, జనసేన పార్టీ నాయకులు కొండవీటి శ్రీనివాసరావు, తాడికొండ సాయి తేజ, యార్ల శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొమరగిరి నాగిని, పిఏసిఎస్ చైర్మన్ తిరుమల శెట్టి రాంబాబు, పిఏసిఎస్ డైరెక్టర్ భీమరాజు, అలాగే అత్యధిక సంఖ్యలో వీర మహిళలు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
