వైసీపీ జెండా దిమ్మ తొలగింపు…నిర్మాణం.

వైసీపీ జెండా దిమ్మ తొలగింపు…నిర్మాణం.

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : స్థానిక వామ్భే కాలనీ ప్రాంతంలో వైసీపీ జెండా దిమ్మను వీఎంసీ అధికారులు తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ విషయం తెలుసుకున్న వైసిపి శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.ఘటనా స్థలానికి చేరుకున్న విజయవాడ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ రెడ్డి, అవుతూ శ్రీనివాసరెడ్డి అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి, ప్రతిపక్ష పార్టీల జెండా దిమ్మెలను పడగొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందనీ, గత 15 ఏళ్లుగా (ప్రాంతీయంగా ఉన్న గుర్తు) ఉన్న దిమ్మెను ఇప్పుడు తొలగించడం కేవలం రాజకీయ కక్ష సాధింపేనన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ కార్యకర్తలు ఉత్సాహంగా జెండా ఎగురవేస్తుంటే, ఆ ఉత్సాహాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఒకవేళ అది రోడ్డుకు అడ్డంగా ఉంటే నాయకులకు చెప్పి చర్యలు తీసుకోవాలి కానీ, పోలీసుల అండతో దౌర్జన్యం చేయడం సరికాదన్నారు.

బయట ఉన్న దిమ్మెలను తొలగించగలరేమో కానీ, ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ జెండాను ఎవరూ తొలగించలేరన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి మంచి పరిపాలన అందించడంపై దృష్టి పెట్టలన్నారు.

Leave a Reply