Kurnool |కర్నూలులో విషాదం

Kurnool | కర్నూలులో విషాదం

  • ఇద్దరు బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్య.
  • గార్గేయపురం సమీపంలో ఘటన

Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : క‌ర్నూలు జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కర్నూలు మండలం గార్గేయపురం గ్రామంలో తల్లి ఇద్దరు చిన్నారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గార్గేయపురం గ్రామానికి చెందిన రాజేశ్వరి (35) తన ఇద్దరు పిల్లలు అబ్రహం (3), సుకుమార్ (6)తో కలిసి గ్రామ చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. కుటుంబ కలహాల కారణంగా రాజేశ్వరి కొంతకాలంగా తన పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం.

Kurnool |

భర్తతో ఉన్న మనస్పర్థలు, కుటుంబ సమస్యల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్వరి ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు భావిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థుల సహాయంతో చెరువులో నుంచి మృతదేహాలను వెలికితీశారు.

Kurnool |

అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Kurnool |

CLICK HERE TO READ MORE : ప్రాణం తీసిన అక్రమ సంబంధం

CLICK HERE TO READ MORE

Leave a Reply