Tehran explosions rally : టెహ్రాన్ వీధుల్లో ఇరాన్ గర్జన Andhra Prabha News

Tehran explosions rally : టెహ్రాన్ వీధుల్లో ఇరాన్ గర్జన Andhra Prabha News

  • పేలుళ్లు మధ్య Quds Day ర్యాలీ
  • ఇటు ఇజ్రాయెల్ దాడులు
  • అటు ఇరాన్ ప్రతీకారం…
  • మిస్సైళ్లు, డ్రోన్లతో కౌంటర్ అటాక్…
  • ఇజ్రాయెల్ నగరాల్లో విధ్వంసం
  • గల్ఫ్ దేశాల్లో గగ్గోలు…
  • డ్రోన్ల దాడులతో అలజడి
  • పశ్చిమాసియాలో రణఘోష‌

( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ )​

ఆకాశంలో విమానాల రొద.. జనవాసాలపై బాంబుల వర్షం.. వీధుల్లో భారీ పేలుళ్లు.. చెవులకు చిల్లులు పెట్టే శబ్ధాలకు ఇరాన్​ రాజధాని టెహ్రాన్‌లో జనతరంగం ఉవ్వెత్తున ఎగసింది. అమెరికా, ఇజ్రాయెల్ కు వ్యతిరేక ఇరాన్​ ఘర్షన పిక్కటిల్లింది. బాంబులకు బయపడలేదు. చలించలేదు. నడివీధుల్లో..

Tehran explosions rally

దేశంపై ప్రేమ పరవళ్లు తొక్కింది. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు జరిగిన ప్రదర్శన కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, ఇది ఏటా నిర్వహించే ‘అల్ ఖుద్స్ డే’ (Quds Day) ర్యాలీ. ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న పాలస్తీనా భూభాగాలకు, ః జెరూసలేం (అల్ ఖుద్స్) విముక్తికి మద్దతు తెలపడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం.

Tehran explosions rally

సమరశీలతను చాటడం: ప్రస్తుతం ఇరాన్‌పై నేరుగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో, దేశ నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్న సంఘీభావాన్ని, శత్రువుల దాడులకు భయపడటం లేదనే సందేశాన్ని ప్రపంచానికి చాటడం మరో ముఖ్య లక్ష్యం. నాయకత్వానికి మద్దతు: ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత కొత్తగా ఎన్నికైన మొజ్తబా ఖమేనీకి తమ విధేయతను ప్రకటించడానికి కూడా ఈ వేదికను ఉపయోగించుకున్నారు.

Tehran explosions rally : జనంలో ఆవేశం.. ఆక్రోశం

Tehran explosions rally

ర్యాలీ జరుగుతున్న సమయంలోనే ఎన్‌క్విలాబ్ స్క్వేర్ (Enqelab Square) మరియు ఫెర్దోసి స్క్వేర్ (Ferdowsi Square) ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. అయినా ప్రజలు బిత్తరపోలేదు. ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తోంది దేశాన్ని నాశనం చేయడానికే గానీ, రాజకీయ మార్పు కోసం కాదని చాలా మంది ఇరానియన్లు భావిస్తున్నారు. అందుకే ప్రాణాలకు తెగించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

Tehran explosions rally : అధికారులు సైతం ,,

Tehran explosions rally

ఇరాన్ జాతీయ భద్రతా చీఫ్ అలీ లారిజానీ వంటి అగ్రనేతలు స్వయంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. “ఇజ్రాయెల్ భయంతోనే ఈ దాడులు చేస్తోంది, మేమేమీ భయపడటం లేదు” అని ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. దాడులకు ముందు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపివేయడం వల్ల చాలా మందికి ఆ హెచ్చరికలు అందలేదు. యుద్ధ సమయంలో శత్రువుకు భయపడలేదని నిరూపించడానికి ఇరాన్ ప్రభుత్వం ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించింది. ప్రజలు రోడ్లపైకి వస్తేనే శత్రువును ఓడించగలమని అధ్యక్షుడు పీజెష్కియాన్ పిలుపునిచ్చారు.

Tehran explosions rally : గర్జించిన ఇరాన్​

Tehran explosions rally

ఈ దాడుల్లో ర్యాలీ జరుగుతున్న ప్రాంతం సమీపంలోనే ఒక మహిళ మరణించినట్లు సమాచారం. అయినప్పటికీ, ప్రజలు “మరణం ఇజ్రాయెల్‌కు, మరణం అమెరికాకు” అనే నినాదాలతో తమ నిరసనను కొనసాగించారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయని, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

ALSO READ : French soldier killed : ఇరాక్ లో మ‌రో టెర్ర‌ర్ Andhra Prabha News

Leave a Reply