ముకమామిడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా
ముకమామిడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా
మూకమామిడి గ్రామ పంచాయతీ ప్రారంభించిన ఎమ్మెల్యే జారే
ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలములో మూకమామిడి లో నూతన పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవం అనంతరం స్థానిక సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి.అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.పంచాయతీ పరిపాలనకు పాలకవర్గానికి గ్రామపంచాయతీ కార్యాలయం ముఖ్యమని ప్రజల సమస్యలు తీర్చడానికి పంచాయతీ కార్యాలయం ఉపయోగపడాలని,పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేస్తా అని అన్నారు.
మూకమామిడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా రానున్న కొద్ది నెలల లోనే ప్రారంభం జరుగుతుందని తెలియజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని తీర్చడానికి మండలంలోని త్వరలో ముఖాముఖి రచ్చబండ కార్యక్రమాన్ని మూకమామిడి పంచాయతీలో నిర్ణయించాలని మండల అధికారులకు సూచించారు. పంచాయితీల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాను అని మాట్లాడారు.అనంతరం కార్యక్రమాన్న ఉద్దేశించి ముత్యాలంపాడు సర్పంచ్ కల్లూరు కిషోర్,ఎంపీటీవో రామారావు,ఎమ్మార్వో భాగ్యలక్ష్మి మండల అధికారులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్,ఆర్డబ్ల్యూఈ వరప్రసాద్, కరెంట్ ఏఈ సురేష్, ఎంపీ ఓ రమేష్ బాబు ఆర్ఐ బద్రునాయక్, పంచాయతీ సెక్రెటరీ కె శ్రీనివాసరావు, వార్డు మెంబర్లు సున్నం భద్రమ్మ కనితి ఇచ్చిన వెంకటేశ్వర్లు బచ్చల చైతన్య కుమారి భూక్య అశోక్ భూక్య మంగమ్మ కీసరి రాజ్ కుమార్ కొడుమే ముత్తయ్య ,సీతయ్య గూడెం మాజీ సర్పంచ్ కారం సుధీర్ ముకమామిడి మాజీ ఎంపీటీసీ తాటి తులసి నాయకులు శాస్త్ర బోయిన వెంకటేశ్వర్లు,కీసరి వెంకట్రావు పున్నెం రామచంద్రం భూక్య దేవ్ సింగ్,కొప్పుల రాంబాబు తమ్మిశెట్టి శ్రీను అనంతుల సత్యనారాయణ,ముత్యం బిక్షం,పైదా కోటేష్ పాయం రాజు,చావ ప్రశాంత్ సురభి రాజేష్, గ్రామ ప్రజలు గ్రామ యువకులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
