90 Days | సుప్రీంకోర్టు స్టే
90 Days | సుప్రీంకోర్టు స్టే
90 Days | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సినిమా విడుదలకు 90 రోజుల ముందే టికెట్ రేట్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేయాలని జనవరిలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా SC ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. టికెట్ ధరల పెంపుపై ఎప్పుడూ అనుసరిస్తున్న విధానాన్నే పాటించాలని సూచించింది. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.
