200 kg | డ్రస్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున తయారీ..

200 kg | డ్రస్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున తయారీ..

200 kg | 200 కేజీల అల్ప్రజోలాం స్వాధీనం
రూ 47 కోట్ల విలువైన మాదక పదార్థాలు పట్టివేత
హైదరాబాద్ కేంద్రంగా రా మెటీరియల్ సరఫరా…
ఇద్దరు నిందితులు పోలీస్ అదుపులో

200 kg | ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం, (ఎన్టీఆర్ జిల్లా) : ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అక్రమంగా నడుస్తున్న భారీ మాదక ఔషధ తయారీ కేంద్రాన్ని అధికారులు వెలికితీశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్థ డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో సుమారు 200 కిలోల అల్పరాజోలుమ్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మాదక పదార్థం విలువ సుమారు రూ.47 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. డీఆర్ఐ అధికారుల సమాచారం మేరకు కొండపల్లి పరిశ్రమల ప్రాంతంలో ఎం ఎస్ రాస్ ఆర్గానిక్స్ పేరిట రహస్యంగా మాదక ఔషధ తయారీ జరుగుతున్నట్లు గోప్య సమాచారంతో గుర్తించారు. అనంతరం నిర్వహించిన దాడుల్లో భారీ పరిమాణంలో రసాయనాలు, యంత్రాంగం బయటపడింది.

200 kg | భారీగా కెమికల్స్, యంత్రాలు స్వాధీనం..

కొండపల్లిలో జరిగిన దాడుల సమయంలో అధికారులు 2860 లీటర్ల వివిధ రకాల కెమికల్స్, 800 కిలోల రా సబ్స్టెన్స్, అలాగే డ్రగ్ తయారీకి వినియోగించే రియాక్టర్లు, డ్రైయర్లు, సెంట్రిఫ్యూజ్‌లు వంటి పరిశ్రమల యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన పదార్థాల పరిమాణాన్ని బట్టి కొంతకాలంగా ఇక్కడ భారీ స్థాయిలో ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

200 kg | ఇద్దరు నిందితులు అదుపులో

ఈ కేసులో హైదరాబాద్ బొల్లారానికి చెందిన కనుమూరి సాయి త్రిభువన్ వర్మ, సౌరబ్ కుమార్లను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఫార్మా రంగానికి చెందిన అనుభవాన్ని ఉపయోగించి అక్రమంగా ఆల్ప్రజోలాం తయారీ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

200 kg | ఫార్మా అనుభవం ఉన్న వ్యక్తి కీలక పాత్ర..

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఫార్మా రంగంలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి రా మెటీరియల్ సమకూర్చి కొండపల్లిలో తయారీ నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

200 kg | అంతర్రాష్ట్ర మాదకద్రవ్య రాకెట్‌పై అనుమానం..

తయారైన డ్రగ్‌ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే ముఠా ఉండే అవకాశాలపై అధికారులు దర్యాప్తు విస్తరించారు. స్వాధీనం చేసిన కెమికల్స్, యంత్రాల పరిమాణం చూస్తే పెద్ద స్థాయి నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అక్రమ రసాయన తయారీ కేంద్రాలపై నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. కేసుపై డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Leave a Reply