విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : పదవ తరగతి విద్యార్థులు ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని బిజెపి దళిత మోర్చా అధికార ప్రతినిధి ఎం.విజయకుమార్ అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎస్సీ బాలుర వసతి గృహంలో పదోతరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో ఇష్టపడి చదువుకొని జీవితంలో స్థిరపడాలన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తారని వారి ఆశలు నెరవేర్చడంతోపాటు మంచి మార్కులు సాధించాలనిఅన్నారు. ఎస్సీ హాస్టల్లో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకొని పదో తరగతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించి రాష్ట్రంలోనే ఊట్కూర్ ఎస్సీ బాలుర వసతి గృహానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు.

ప్రతి విద్యార్థి ప్రణాళిక బద్ధంగా పరీక్షలకు సిద్ధం కావాలని ఉత్తమ ఫలితాలు సాధిస్తే ఆ తర్వాత చదువుకునే విద్యాభ్యాసం పై తమ వంతు సహకారం ఉంటుందన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు ప్రతి విద్యార్థి సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్, వార్డెన్ వెంకటేష్ వార్డు సభ్యులు అక్షయ్, బిజెపి మాజీ మండల అధ్యక్షులు రమేష్, నాయకులు బాలాంజనేయులు, రఘువీర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply