చిట్యాలలో గ్యాస్ కొరత..

చిట్యాలలో గ్యాస్ కొరత..

  • బుకింగ్ లో తప్పని తిప్పలు..
  • ఆందోళనలో మహిళలు..
  • బ్లాక్ మార్కెట్లో డొమెస్టికల్ గ్యాస్ సిలిండర్ 4500..

చిట్యాల, ఆంధ్రప్రభ : పచ్చిమాసీయాలో యుద్ధ వాతావరణ నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా పై తీవ్ర ప్రభావం ఏర్పడిన నేపథ్యంలో నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం పరిధిలో గ్యాస్ కొరత ఏర్పడింది. అధికారులు గ్యాస్ కొరత లేదు అని చెప్పినప్పటికీ.. సాధారణ ప్రజలకు గ్యాస్ అందని ద్రాక్షలాగా అయిపోతుంది. ఇదిలా ఉండగా గ్యాస్ సిలిండర్ మాత్రం బ్లాక్ మార్కెట్లో 4500 వరకు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.

గతంలో డొమెస్టిక్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత సిలిండర్ డెలివరీకి 15 రోజులు వ్యవధి ఉండేది, తర్వాత 30 రోజులు, 45 రోజులు పడుతుందని స్థానిక గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చెప్పడం గమనార్హం. ఒక సిలిండర్ ఉన్నవారికి ఇరవై ఒక రోజులు తర్వాత బుక్ చేసుకోవాలని షరతు విధించారు. ఇదిలా ఉండగా బ్లాక్ మార్కెట్లో వీరికి ఎలా సిలిండర్ వెళ్తున్నాయో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల అవసరాలు కోసం వంట గ్యాస్ అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

Leave a Reply