Iran Backed Militia : కూలిన US KC-135 Andhra Prabha News

Iran Backed Militia : కూలిన US KC-135 Andhra Prabha News
- విమాన సిబ్బంది 6 గురు గల్లంతు
- ఆపరేషన్ ‘Epic Fury’ లో తొలి షాక్
- అమెరికా ట్యాంకర్ విమానం క్రాష్
- US Air Force కి అనూహ్య దెబ్బ
- ఇరాక్ – జోర్డాన్ సరిహద్దులో ఘటన
- CENTCOM దర్యాప్తు షురూ
- దేశం కోసం కూల్చాం : ఐఆర్ ఐ మిలీషియా
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)
డామిట్.. ఆపరేషన్ ఎథిక్ ఫ్యూరీ స్టోరీ రివర్స్ ప్లే అవుతోంది. ఇజ్రో అమెరికన్ జాయింట్ ఆపరేషన్ కు తొలి షాక్ అలజడి సృష్టించింది. గత 13 రోజులుగా ఇరాన్ మాత్రమే ఒంటరి పోరు చేస్తుంటే… తాజాగా గల్ఫ్ దేశాల్లో టెర్రరిస్టు బురఖాలోని లోకల్ హీరోలు తెరమీదకు వచ్చారు. అమెరికా సైన్యానికి టెరిఫిక్ షాక్ ఇచ్చారు. పశ్చిమ ఇరాక్‌లో KC-135 స్ట్రాటోట్యాంకర్ (KC-135 Stratotanker) అనే అమెరికా విమానం కూలిపోయింది. భారత కాలమానం ప్రకారం ఈ ఘటన మార్చి 13, శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3:21 AM ప్రాంతంలో జరిగింది. పశ్చిమ ఇరాక్‌లోని తురైబిల్ (Turaibil) సమీపంలో ఇరాక్-జోర్డాన్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటనను గుర్తించారు.
Iran Backed Militia : శత్రువుల దాడి కాదు.. పెంటగాన్

శత్రువుల దాడి (Hostile Fire) వల్ల ఈ విమానం కూలిపోలేదని పొరపాటున తమ దళాల దాడి (Friendly Fire) తో కూలిపోలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఆకాశంలోనే ఇంధనం నింపే సమయంలో (Refueling incident) సాంకేతిక లోపం లేదా విమానాలు ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనలో రెండవ విమానం సురక్షితంగా ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. కూలిపోయిన విమానంలో సుమారు 6 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు (Rescue operations) కొనసాగుతున్నాయి.
Iran Backed Militia : ఇది మా పనే : లోకల్ టీమ్ వెల్లడి
ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల సాయుధ గ్రూపులు (Islamic Resistance in Iraq) ప్రకటించాయి. ఈ అమెరికన్ విమానాన్ని తామే కూల్చివేసినట్లు ప్రకటించాయి. తమ దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడంలో భాగంగానే ఈ దాడి చేసినట్లు స్పష్టం చేశాయి. ఇరాక్ భద్రతా దళాలు ప్రమాద స్థలికి చేరుకున్నాయని, పైలట్ కోసం గాలిస్తున్నట్లు ఇరాక్ మీడియా వెల్లడించింది. ఇరాక్ భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, ఇది ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా అమెరికా నిర్వహిస్తున్న నిఘా మరియు మద్దతు చర్యల సమయంలో జరిగిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటన ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ విమానం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury) లో భాగంగా ఇరాన్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
Iran Backed Militia : సిబ్బంది కోసం జల్లెడ

ప్రస్తుత సమాచారం ప్రకారం, కూలిపోయిన KC-135 విమానంలో 6 మంది సిబ్బంది (Crew Members) ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. అమెరికా రక్షణ శాఖ ఇంకా అధికారికంగా మరణాలను ధృవీకరించలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ అండ్ రెస్క్యూ (Search and Rescue) ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. విమానం కూలిన తీవ్రతను బట్టి లోపల సిబ్బంది ప్రాణాలతో ఉండటం కష్టమని కొన్ని అనధికారిక వర్గాలు భావిస్తున్నాయి, కానీ పెంటగాన్ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.
Iran Backed Militia : అమెరికా ఉలికి పాటు
ఇది సాంకేతిక లోపమా లేక శత్రువుల డ్రోన్ల వల్ల జరిగిందా ని అనే కోణంలో CENTCOM దర్యాప్తు చేస్తోంది. ఇరాక్, సిరియా సరిహద్దుల్లోని అమెరికా స్థావరాల పై ఆకాశంలో నిఘాను (Aerial Surveillance) మరింత పెంచారు. ఒకవేళ ఈ ఘటన వెనుక ఇరాన్ అనుకూల గ్రూపుల హస్తం ఉందని తేలితే, ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) లో భాగంగా కఠిన ప్రతీకార దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇరాక్ ప్రభుత్వం తమ భూభాగంలో ఉన్న సాయుధ గ్రూపులను నియంత్రించాలని అమెరికా దౌత్యపరంగా ఒత్తిడి తెస్తోంది. ఈ ఘటన వల్ల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ALSO READ : Iran Action Attribution : చిక్కొద్దు.. దొరకొద్దు Andhra Prabha Analysis
