విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
విద్యార్థులు చట్టాల పై అవగాహన పెంచుకోవాలి
సీఐ బన్సీలాల్
చెన్నూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్క విద్యార్ధి చట్టలపై కనీస అవగాహన పెంచుకోవాలని చెన్నూర్ టౌన్ సీఐ బన్సీలాల్ అన్నారు. కేంద్రప్రభుత్వం MP SH (మహిళ పోలీస్ వాలంటీర్స్ స్కూల్ హెల్త్ అవేరేన్స్ ) పథకం లో భాగంగా ఇవ్వాళ స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీఐ బన్సీలాల్ మాట్లాడుతూ ఫోక్స్, మత్తుపదార్థాల నియాత్రణ వంటి కీలక చట్టాల పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
అపరిచితులతో స్నేహం చేసే విషయంలో అప్రమతంగా ఉండాలని, సాంకేతిక ప్రరిజ్ఞానాన్ని కేవలం విజ్ఞానం కొరకు వాడుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్యురాలు సంధ్య మాట్లాడుతూ ఆడపిల్లలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రతలు తీసుకోవాలని ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడంలో శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పలు అంశాలపై అవగాహనా కల్పించిన ముఖ్య అతిథులను పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించారు.
