విద్య మాత్రమే భవిష్యత్తుకు పునాది..

రేగొండ, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం జగ్గయ్యపేట ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు 9 వ తరగతి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని సంవత్సరo అంతా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ కార్యక్రమం ఆత్మీయంగా జరిగింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒంటేరు చంద్రశేఖర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ… విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్య మాత్రమే భవిష్యత్తుకు బలమైన పునాది అని, పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలుసాధించాలని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు. గిరిధర కృష్ణ, రాజేందర్, చక్రధర్ రావు,తంగల్ల పల్లి కుమారస్వామి, శ్రీధర్, కోటిలింగం, మహేందర్, శిరీష, శ్రీనివాస్, కల్పనా కుమారీ, మాధవి, ప్రతాప్, రమాదేవి, విద్యార్థులు పాల్గొని పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 9వ తరగతి విద్యార్థులు తమ సీనియర్లకు మధుర జ్ఞాపకంగా వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు.
